దేశాల్ని కాదు,
హృదయాల్ని గెలుస్తాం...!
విజ్ఞాన, గ ణిత, సాంకేతిక రంగాల్లో విదేశాలదే పై చేయని చాలా మంది అనుకుంటారు గానీ, గణాంకాలకు మూలమైన సున్నాను, దశాంశాన్ని కనిపెట్టింది భారతీయుడైన ఆర్యభట్ట కదా మరి ! అలా విజ్ఞాన రంగాల్లోనే కాదు సంస్కృతి, మానవ సంబంధ వికాసంలోనూ అనాదిగా, భారతదేశమే శిఖర స్థానంలో ఉంటూ వస్తోంది. అమెరికా వెళ్లిన భారతీయ యువకుడు భారతీయ జీవన విశిష్టతలను, ఇక్కడి మానవ విలువల ఉత్కృష్టతను ఈ పాట ద్వారా అక్కడి వాళ్లకు వివరిస్తాడు. ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ సినిమా కోసం ఇందీవర్ రాసిన ఈ గీతానికి కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ సంగీతం సమకూరిస్తే, భారతీయుల గుండెలు సగర్వంతో పులకించిపోయేలా మహేంద్రకపూర్ పాడాడు.
* * * * *
జబ్ జీరో దియా మేరే భారత్ నే, దునియా కో తబ్ గిన్‌తీ ఆయీ జీరో కీ భాషా భారత్ నే, దునియా కో పహెలే సిఖ్‌లాయీ
దేతా న దశ్‌మలవ్ భారత్ తో యూఁ చాంద్ పే జానా ముష్కిల్ థా
ధర్‌తీ ఔర్ చాంద్ కీ దూరీ కా, అందాజా లగానా ముష్కిల్ థా
( నా భారతావని సున్నాను కనుగొన్నాకే ప్రపంచానికి లెక్కించడం తెలిసింది
సున్నా భాషను ఈ దేశమే లోకానికి తొట్టతొలుత నేర్పించింది
భారతదేశం దశాంశ జ్ఞానమే ఇవ్వకపోతే చంద్రుని మీదికి వెళ్లడం క ష్టమయ్యేది
భూమి, చంద్రుల మధ్య దూరాన్ని అంచనా వేయడం కష్టమయ్యేది)
సభ్యతా జహాఁ పహెలే ఆయీ, జన్మీ జహాఁ పహెలే కలా
మేరా భారత్ వో భారత్ హై, జిస్‌కే పీఛే సంసార్ చలా
సంసార్ చలా ఔర్ ఆగే బఢా, ఆగే బఢా ఔర్ బఢ్‌తా హీ గయా
భగ్‌వాన్ కరే యే ఔర్ బఢే, బఢ్‌తా హీ రహే ఔర్ ఫూలే ఫలే
(ఎక్కడ సభ్యత ముందుగా వచ్చిందో, కళాత్మకత ఎక్కడ తొలుత జనించిందో
ఆ నా భరతభూమి వెనుక యావత్ ప్రపంచమే నడిచింది. అడుగు ముందుకు వేస్తూ ఇంకా ఎంతో పురోగమించింది. దైవం ఇలా ఇంకా ముందుకు తీసుకుపోనీ, వృద్ధికి తేనీ, మరెంతో వికసింపచేయనీ)
హై ప్రీత్ జహాఁ కీ రీత్ సదా, మై గీత్ వహాఁ కే గాతా హూఁ
భారత్ కా రహెనే వాలా హూఁ, భారత్ కీ బాత్ సునాతా హూఁ
( ఎక్కడైతే ప్రేమ ఎప్పుడూ ఒక రీతిగా ఉందో, అక్కడి గీతాన్ని నేను గానం
చే స్తాను, భారత వాసిని నేను, భారతీయ విషయాల్ని వినిపిస్తాను)
కాలే గోరే కా భేద్ నహీఁ హర్ దిల్ సే హమారా నాతా హై
కుఛ్ ఔర్ న ఆతా హో హమ్ కో, హమే ప్యార్ నిభానా ఆతా హై
జిసే మాన్ చుకీ సారీ దునియా, మై బాత్ వహీ దోహ్‌రాతా హూఁ / భారత్ కా రహెనే/
(నలుపు తెలుపు భేద భావం లేదు, ప్రతి హృదయంతోనూ మా అనుబంధం ఉంది. మాకు మరేదో రాకపోయినా, ప్రేమను నిలబెట్టుకోవడం మాత్రం బాగా తెలుసు. దేన్ని లోకమంతా ఒప్పుకుందో, ఆ మాటే నేను మళ్లీ చెబుతాను)
భారతీయులు అమితంగా ఆరాధించే శ్రీరాముడు, శ్రీకృష్ణుల శరీర వర్ణం నలుపు రంగే. ఇలాంటి వారికి నలుపు తక్కువ తెలుపు ఎక్కువ అనే వర్ణభేదం ఎలా ఉంటుంది? భారతీయులకు ప్రేమను పంచడం, ప్రేమల్ని సమున్నతంగా నిలబెట్డడమే పరమ లక్ష్యంగా ఉంటుంది. ఇది వాస్తవమని ఏవో ఒకటి రెండు దేశాలు కాదు, మొత్తం ప్రపంచమే ఆమోదించింది. నిజానికి, లోకానికి ఆ మార్గాన్ని ఆ గమనంలోని రహస్యాల్ని తెలియజెప్పడమే ధర్మంగా భారతదేశం సాగిపోతోంది. .
జీతే హో కిసీ నే దేశ్ తో క్యా, హమ్‌నే తో దిలోంకో జీతా హై
జహాఁ రామ్ అభీ తక్ హై నర్ మే, నారీ మే అభీ తక్ సీతా హై
ఇత్‌నే పావన్ హై లోగ్ యహాఁ మై నిత్ నిత్ శీశ్ ఝుక్‌తా హూఁ / భారత్ కా రహెనే/
(ఎవరైనా దేశాల్ని గెలిచారేమో గానీ, మేమైతే హృదయాల్ని గెలిచేశాం
ఇక్కడి ప్రతి పురుషుడిలోనూ రాముడున్నాడు, ప్రతి స్త్రీ లోనూ సీత ఉంది
ప్రజలెంత పవిత్రంగానో ఉన్నారో ఇక్కడ.. వారి ముందు అనునిత్యం శిరస్సు వంచుతాను. )
యుద్ధాలు చేసి, ఎవరైనా దేశాలు గెలుచుకోవచ్చేమో గానీ, ఏ యుధ్ధాలు చేసి హృదయాల్ని గెలుస్తారు? ప్రేమ బావుటా ఎగరేయాలి గానీ, రక్తపాతంతో ఎవరైనా గుండెలకు చేరువ కాగలరా? భౌతిక సంపద మీద వ్యామోహం పోతే గానీ, ప్రేమ సంపదను సమకూర్చుకోలేరు. అందుకే ప్రేమ రాజ్యాల్ని గెలవడం ద్వారా భారతీయులు రారాజులయ్యారు. పరిణామ క్రమంలో చోటు చేసుకునే ఉత్తాన పతనాలు ఎలాగూ ఉంటాయి కానీ అనాదిగా వస్తున్న మానవీయ విలువలు ఇతరుల కన్నా మిన్నగా ఈ దేశంలో కొనసాగుతున్నాయి. వాటి ముందు ఎవరైనా సవినయంగా తలవంచాల్సిందే....
ఇత్‌నీ మమ్‌తా నదియా కో భీ, జహాఁ మాతా కహెకే బులాతే హైఁ
ఇత్‌నా ఆదర్ ఇన్సాన్ తో క్యా పత్తర్ భీ పూజే జాతే హైఁ
ఇస్ ధర్‌తీ పే మైనే జనమ్ లియా, యే సోచ్ కే మై ఇత్‌రాతా హూఁ / భారత్ కా రహెనే/
(నదులంటే ఎంత మమకారమో ఇక్కడ ప్రతి నదినీ తల్లీ అని పిలుస్తారు
మనుషులకు ఎనలేని ఆదరణే కాదు, ఇక్కడ రాళ్లుకూడా పూజింపబడతాయి
ఈ నేల మీద జన్మించాను కదా అన్న భావనతో నేనెంతో గర్వపడతాను)
ప్రతి అణువునా భారతీయులు ఒక దివ్యత్వాన్ని చూస్తారు. దైవంగా ఆరాధిస్తారు. అందుకే ప్రవాహాల్ని ఏదో నదిలే అనుకోరు. ప్రతి నదినీ ఇక్కడ ఒక దేవతగా ఆరాధిస్తారు. ఇదేమిటి మీ దేశంలో రాళ్లను పూజిస్తారు? అంటే మనుషుల్నే కాదు అంతే సమానంగా రాళ్లనూ పూజిస్తామని ఎదురు సమాధానం చెబుతారు. నిజానికి, ఏ పంచభూతాత్మక శక్తి ప్రాణికోటినంతా ఆవరించి ఉందో, ఆ శక్తే సమస్త నిశ్చల ప్రకృతిలోనూ ఉంది కదా! అందుకే చరాచర జగత్తునంతటినీ సమదృష్టితో చూసే సమున్నత సంస్కృతి ఈ దేశీయులకు అబ్బింది. ఏముందిలే అనుకునే వారికి ఏమీ ఉండదు కానీ, అర్థం చేసుకునే వారికి ఈ సంస్కృతి ఆకాశమంత ఎత్తున కనిపిస్తుంది.
No comments :
Post a Comment